ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో సంపూర్ణ పారిశుధ్యం

మోత్కూర్, ఆంధ్రప్రభ ; ప్రజా పాలన ప్రగతి ప్రణాళికతో మున్సిపాలిటీ లో సంపూర్ణ పారిశుద్ధ్యం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ గడ్డం స్వప్న సోమనర్సయ్య,వైస్ చైర్మన్ పల్లెర్ల వెంకన్న లు అన్నారు.ఆదివారం మున్సిపల్ పరిధిలోని 8,9 వ వార్డులలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ స్వప్న ,వైస్ ఛైర్మన్ వెంకన్న లు స్థానిక కౌన్సిలర్లు పన్నాల శ్రీవిద్య శ్రీనివాస్ రెడ్డి,బీసు శ్రీకాంత్ గౌడ్ , ప్రజలతో కలిసి ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా ఆయా వార్డులలో నిర్వహించిన ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ స్వప్న మాట్లాడుతూ.. వార్డులో పారిశుద్ధ్యముకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే సంబంధిత వార్డు కౌన్సిలర్ దృష్టికి తీసుకు వచ్చినట్లయితే 99 రోజుల ప్రణాళికలో పూర్తి చేసే విధముగా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో 2,11 వ వార్డ్ కౌన్సిలర్లు కూర్మిళ్ల ప్రమీల, కారుపోతుల వెంకన్న గౌడ్,మున్సిపల్ కమిషనర్ కె సతీష్ కుమార్,మేనేజర్ ప్రభాకర్, కార్యాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.