బోరుబావి గుంతను పూడ్చివేయించిన సర్పంచ్..

బోరుబావి గుంతను పూడ్చివేయించిన సర్పంచ్..
కుంటాల, ఆంధ్రప్రభ : కస్తూరిబా గాంధీ విద్యానిలయం పాఠశాల ప్రధాన గేటు వద్ద ఏడాది క్రితం గ్రామస్తుల ఆధ్వర్యంలో తాగునీటి అవసరం కోసం బోరు బావి తవ్వించారు. బోరు వేయగా నీరు బయటకు రాలేదు. దీంతో బోరు బావి కృంగిపోయి ప్రమాదకరంగా మారింది. అయితే.. కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని పరిశీలించడానికి సర్పంచ్ వెళ్ళగా ప్రమాదకరంగా ఉన్న బోరు బావి గుంత కనిపించింది. అది చూసి ఆయన వెంటనే స్పందించి గుంతను మూసి వేయించారు. ఆయన ఆ గుంతను చూసి జెసిపి సాయంతో పూడ్చి వేయడంతో ప్రమాదం తప్పింది.
లేకపోతే.. ఏదైనా సమయంలో ఎవరైనా గుంతలో పడితే ప్రాణాలకు ముప్పు ఉండేదని స్థానికులు తెలియచేశారు. కస్తూర్బా గాంధీ విద్యాలయానికి దగ్గరగా ఉన్న ఈ గుంతలో ప్రమాదం జరిగే ఆస్కారం ఉండటం మూలంగా ముందు జాగ్రత్తగా సర్పంచ్ పెంటవార్ దశరథ్ పూడ్పించారు. దీంతో కస్తూరిబా గాంధీ విద్యాలయ సిబ్బంది స్థానిక సర్పంచ్ పెంటవార్ దశరథ్ కు అభినందనలు తెలియజేశారు.
