మృతుల కుటుంబాలకు అందుకుంటాం

మృతుల కుటుంబాలకు అందుకుంటాం

మొగుళ్ల పల్లి మృతుల కుటుంబాలను పరామర్శ

భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

చిట్యాల, ఆంధ్రప్రభ : ప్రమాదవశాత్తు మొగుళ్ల పల్లి మండలంలోని కొరికి శాలలో శనివారం వ్యవసాయ బావిలో క్రేన్ పడి ముగ్గురు మృతి చెందారు. దీంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిట్యాల సివిల్ హాస్పిటల్ తరలించారు. దీంతో సమాచారం తెలుసుకున్న భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సాయంత్రం సివిల్ హాస్పిటల్ చేరుకొని మృతదేహాలను సందర్శించి, కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అనంతరం ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం, కుటుంబ సభ్యులను, గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు, అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ బాధిత కుటుంబాలను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముకిరాల మధు వంశీకృష్ణ, గూట్ల తిరుపతి, బుర్ర శ్రీనివాస్, కట్కూరి నరేందర్ గుర్రపు తిరుపతి, గంగాధరి రవీందర్, బుర్ర లక్ష్మణ్, అల్లంరాజు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply