టెన్త్ పరీక్షలకు 475 మంది విద్యార్థులు హాజరు

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ ; టెన్త్ పరీక్షలకు 475 మంది విద్యార్థులు హాజరయ్యారని ఏంఈవో ఎన్. ఆంధ్రయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెన్త్ పరీక్షలు కమ్మర్ పల్లి మండలం లోని 4 పరీక్ష కేంద్రాలలో శనివారం ప్రారంభం అయ్యాయని, పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందనీ తెలిపారు. 4 పరీక్ష కేంద్రలలో మొత్తం 478 మంది విద్యార్థులకు 475 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. 3 సిడబ్ల్యూ ఎస్ఎన్ విద్యార్థులకు పరీక్ష మినహాయింపు ఇవ్వడం జరిగిందని, మొత్తం విద్యార్థులు హాజరైనట్లు మండల విద్యాధికారి నేర ఆంధ్రయ్య తెలిపారు.

Leave a Reply