Pocharam | ఆ సినిమా తరహాలో….

Pocharam | ఆ సినిమా తరహాలో….

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని పోచారం (Pocharam) లో రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai) సినిమా తరహా ఘటన చోటుచేసుకుంది. ఓ యువతితో మనోహర్ అనే యువకుడికి వివాహం నిశ్చయమైంది. అయితే యువకుడికి, అతడి తల్లిదండ్రులకు గతంలోనే ఎయిడ్స్ ఉందని యువతికి తెలియడంతో పెళ్లికి నిరాకరించింది.

ఈ క్రమంలో ఈనెల 11న మనోహర్ యువతి ఇంటికి వెళ్లి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. ఒప్పుకోకపోవడంతో యువతికి ఎయిడ్స్ ఇంజెక్షన్ (AIDS injection) ఇచ్చాడు. పోలీసులు యవకుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది..

Leave a Reply