నవజాత శిశు చిన్నారి తల్లులకు కిట్ల పంపిణీ..

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ కామారెడ్డి జిల్లా విభాగం ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కామారెడ్డి ప్రభుత్వ ఏరియా జనరల్ హాస్పిటల్లో నవజాత శిశువుల కొరకు కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ జడ్జి నాగరాణి, ఆర్డీవో వీణ, ఎమ్మార్వో హిమా బిందు, హాస్పిటల్ సూపరిండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై వారి చేతుల మీదుగా నవజత చిన్నారుల తల్లులకు కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ జడ్జి నాగరాణి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ ఆధ్వర్యంలో నవజత శిశువుల కొరకు కిట్లను అందించినందుకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ వారిని అభినందిస్తున్నాను అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయడానికి అందరూ ముందుకు రావాలని కోరారు.

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్ గుప్తా మాట్లాడుతూ.. ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారి ఆదేశాల మేరకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని నవజాత శిశువుల కోసం రూ. 16 వందలు గల 40 కిట్లను వారి తల్లులకు అందజేశారని తెలిపారు.

ఇట్టి అవకాశాన్ని కల్పించినందుకు జిల్లా జడ్జి నాగరాణికి, సూపరిండెంట్ వెంకటేశ్వర్లకి ఆర్డిఓ వీణకి, ఎమ్మార్వో హిమా బిందుకి, ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఐవిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్ గుప్తా, కోశాధికారి కస్వ వెంకటేష్ గుప్తా, మహిళా విభాగం అధ్యక్షులు నీల రజిని, కార్యదర్శి చిలువేరి శ్రీదేవి, కోశాధికారి గజవాడ అన్నపూర్ణ, యువజన నాయకులు ఈశ్వర్ గుప్తా చరణ్, ప్రవీణ్, నికిల్ కొత్త సంగరాజు గుప్త ఐ వి ఎఫ్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.