బస్వాపూర్ పాఠశాలలో అక్షరాభ్యాసం..

బస్వాపూర్ పాఠశాలలో అక్షరాభ్యాసం..

  • బడిబాట ద్వారా విద్యార్థుల చేరికలు

జుక్కల్ (కామారెడ్డి), ఆంధ్రప్రభ : జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో మంగళవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. దీంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.

అనంతరం పాఠశాలలో చిన్నారులకు అక్షరాభ్యాసం నిర్వహించి, సరస్వతీ దేవి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు జయచంద్, గ్రామ పెద్ద సురేష్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు.

విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉచిత యూనిఫాంలు, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్కులు అందజేస్తున్నామని, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ విద్యా ప్రమాణాలు పెంపొందిస్తున్నామని పేర్కొన్నారు. తల్లిదండ్రులంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బోర్కార్ అనిల్, గ్రామ కార్యదర్శి భరద్వాజ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు.