పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం..

పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం..
పరీక్షలు రాయనున్న 1156 మంది విద్యార్థులు.
నర్సంపేట, ఆంధ్రప్రభ : పదవ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్లు నర్సంపేట ఎంఈఓ కోర్ర సారయ్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుండి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన కుండా సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. నర్సంపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో 197 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. మాడల్ (బొంద బడి) పాఠశాలలో 120 మంది, గీతాంజలి పాఠశాలలో 239 మంది, బాలుర ఉన్నత పాఠశాలలో 140 మంది, విజ్ డమ్ పాఠశాలల్లో 240 మంది, వల్లబ్ నగర్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 220 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు ఎంఈఓ వివరించారు. ఈ పరీక్షల నిర్వహణకు 60 మంది విరిజిరేటర్లతోపాటు ఫ్లయింగ్ స్క్వాడ్ మూడు టీములలో తొమ్మిది మంది పర్యవేక్షించనున్నట్లు తెలిపారు.
ఫ్లయింగ్ స్కాడ్ లో ఒక టీం లో రెవెన్యూ, ఎడ్యుకేషన్, పోలీస్ శాఖల నుండి అధికారులను నియమించినట్లు తెలిపారు. ఒక్కొక్క సెంటర్కు సెట్టింగ్స్ కార్డు ఒకరు ఉండగా డివోలు ఆరుగురు, ఎస్సీలు ఆరుగురు ఈ పరీక్షల సమయంలో విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. నర్సంపేట డివిజన్ లోని ఖానాపురం మండల కేంద్రంలో ఒక పరీక్ష కేంద్రం, నల్లవెల్లి మండల కేంద్రంలో రెండు పరీక్షా కేంద్రాలు, నెక్కొండ మండల కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాలు, దుగ్గొండి మండల కేంద్రంలో ఒక పరీక్ష కేంద్రాన్ని, నర్సంపేట పట్టణంలో 6 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
