బోరు వెల్ ఏర్పాటు పనులకు పూజ..

కడెం, ఆంధ్రప్రభ ; కడెం మండలంలోని బెల్లాల్ గ్రామ పంచాయతీ లోని ఎస్టీ కాలనీలో ఉట్నూర్ ఐటీడీఏ ద్వారా మంజూరైన నూతన మంచి నీటి బోర్ వెల్ ఏర్పాటు పనులను బెల్లాల్ గ్రామ సర్పంచ్ బొంతల లక్ష్మీ భూమన్న యాదవ్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎల్తపు అనూష శ్రీనివాస్, వార్డ్ సభ్యులు ఆత్రం రాజేష్, చక్కటి లలిత, ఎస్టీ కాలనీ గ్రామ పెద్దలు, వెంకటేష్, హనుమంతు గ్రామస్తులు పాల్గొన్నారు.
