ముస్లింల సంక్షేమానికి కృషి..

ముస్లింల సంక్షేమానికి కృషి..
ఇఫ్తార్ విందులో భూపాలపల్లి ఎమ్మెల్యే జి ఎస్ ఆర్,
చిట్యాల, ఆంధ్ర ప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి కృషి చేస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, అన్నారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలో కౌసర్ ఈ మజీద్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యేగండ్రసత్యనారాయణరావు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ముస్లిం సోదరులకు రంజాన్ కానుకగా బట్టలపంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం ముస్లింల సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల సర్పంచ్ తౌటం లక్ష్మీ, ఆర్డిఓ మోతిలాల్ , తాసిల్దార్ ఇమామ్ బాబా, చిట్యాల సీఐ మల్లేష్, ఏడిఏ వెంకన్న, చిట్యాల వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, మాజీ మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి రాజమహమ్మద్, ప్రజా ప్రతినిధులు , నాయకులు, మజీద్ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
