జీపీ భవనాని ప్రారంభించిన ఎమ్మెల్యే

జీపీ భవనాని ప్రారంభించిన ఎమ్మెల్యే
రూ.40 లక్షలతో నిర్మించిన జీపీ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
జన్నారం, ఆంధ్రప్రభ : మండలంలోని చింతగూడ,చింతలపల్లి గ్రామంలో రూ.40 లక్షలతో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాలను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గురువారం మధ్యాహ్నం ప్రత్యేక పూజలు చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,ప్రజలకు పాలనను చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
చింతగూడ గ్రామంలో ఉన్న పెండింగ్ సమస్యలను గ్రామ సర్పంచి సుతారి సుమలత- వినయ్ కుమార్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా,స్పందించిన ఎమ్మెల్యే సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమర్ షరీఫ్, ఇన్చార్జి తాహసిల్దార్ నేరెళ్ల రామ్మోహన్,చింతలపల్లి గ్రామ సర్పంచి పంజాల సురేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ముజఫర్,మాణిక్యం, పంచాయతీ పంచాయతీ కార్యదర్శులు రాజన్న,లత పాల్గొన్నారు.
