మెయిన్ రోడ్డు పై ట్రాక్టర్ ట్రాలీ బోల్తా

మెయిన్ రోడ్డు పై ట్రాక్టర్ ట్రాలీ బోల్తా

  • డ్రైవర్ క్షేమం..తప్పిన ప్రమాదం

మోత్కూర్, ఆంధ్రప్రభ ; మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలోని పాత కూరగాయల మార్కెట్ వద్ద మర్రి శేఖర్ కి చెందిన ట్రాక్టర్ ను అతని కొడుకు నడుపుతూ మట్టి లోడ్ తో పోతాయిగడ్డ నుండి చెరువు కట్ట వైపు అతివేగంతో వెళ్తున్న ట్రాక్టర్ ఒక్క సారిగా అదుపుతప్పడంతో అమాంతంగా ట్రాక్టర్ ట్రాలీ కాస్త బోల్తా పడింది. ఈ సంఘటనలో ట్రాక్టర్ ఇంజన్ అలాగే ఉండడంతో డ్రైవర్ కి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ సమయంలో రోడ్డు పై ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.

Leave a Reply