Iran Suicide Drones : 2 షిప్స్ మటాష్.. Andhta Prabha News

Iran Suicide Drones : 2 షిప్స్ మటాష్.. Andhta Prabha News
- ఇరాన్ స్ట్రయిట్ స్ట్రయిక్స్
- ఏపీ నావికుడు మృతి
- ఇండియా డెత్ టోల్ 6
- ఇరాక్ గగ్గోలు
- పర్షియన్ గల్ఫ్‌లో టెన్షన్ ,,, టెన్షన్
- నౌకలపై వరుస దాడులు
- భారతీయ నావికులు బిక్కు బిక్కు
- ఇరాన్ తప్పు చేస్తోంది
- తగిన మూల్యం తప్పదు
- వైట్ హౌస్ లో ట్రంప్ గర్జన
- కాల్పులు ఆపండి : యూఎన్ ఓ ఆదేశం
- నష్టపరిహారం ఇవ్వండి : ఇరాన్ ప్రతిస్పందన
( ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్)

హోర్మోజ్ జలసంధిలో చమురు నౌకల రవాణాకు బ్రేక్ వేసినందుకు .. 16 ఇరాన్ మైనింగ్ లేయర్ షిప్పులను అమెరికా ధ్వంసం చేసిన కొన్ని గంటల్లోనే ఇరాన్ జరిపిన ఆత్మాహుతి బోట్ ప్రతిదాడిలో.. ఇరాక్ ఓడరేవుల్లో రెండు విదేశీ చమురు ఓడల్ని ఇరాన్ ధ్వంసం చేసింది. ఈ దాడిలో ఓ ఆంధ్రా నావికుడు మృతి చెందాడు. ఈ సమాచారం ఏపీలో తీవ్ర కలకలం రేపింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలతో బయట పడిన భారతీయ నావికులను ఇండియాకు తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. వివరాలు ఇలా ఉన్నాయి.
Iran Suicide Drones ఇరాన్ ప్రతి దాడి

ఇరాక్ దక్షిణ తీరంలోని అల్ – ఫావ్ (al-Faw), ఖోర్ అల్-జుబైర్ (Khor Al-Zubair) ఓడరేవులకు సమీపంలో రెండు విదేశీ చమురు ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడితో మంటల్లో ఓడలు చిక్కుకున్నాయి. ఇరాక్ పోర్ట్స్ కంపెనీ డైరెక్టర్ జనరల్ ఫర్హాన్ అల్ – ఫర్తౌసి అందించిన సమాచారం మేరకు 38 మంది నావికులను సురక్షితంగా రక్షించారు. దురదృష్టవశాత్తు, ఈ ప్రమాదంలో ఒక ఒక నావికుడు మరణించినట్లు ఇరాక్ అధికారిక వర్గాలు ధృవీకరించాయి.
ఈ దాడులకు ఇరాన్ బాధ్యత వహించింది. అండర్ వాటర్ డ్రోన్లు (underwater drones), పేలుడు పదార్థాల ఆత్మాహుతి పడవలను ప్రయోగించి ఈ “విధ్వంసానికి పాల్పడినట్టు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనతో ఇరాక్ తన చమురు రేవులను తాత్కాలికంగా నిలిపివేసింది.

ఒమన్‌లోని సలాలా (Salalah) ఓడరేవులోని ఇంధన ట్యాంకులను ఇరానియన్ డ్రోన్లు ధ్వంసం చేశాయి. గత కొద్ది రోజులుగా ఒమాన్‌లోని దుక్మ్ (Duqm) పోర్ట్‌పై కూడా ఇటువంటి దాడులు జరిగినట్లు సమాచారం ఉంది. ఈ దాడులను ఇరాక్ ప్రభుత్వం తమ సార్వభౌమాధికారంపై జరిగిన దాడిగ పరిగణిస్తోంది, అంతర్జాతీయ స్థాయిలో చట్టపరమైన చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని ప్రకటించింది.
Iran Suicide Drones : మిడ్ నైట్ రైడ్స్..

అమెరికా కంపెనీ యాజమాన్యంలోని మార్షల్ ఐలాండ్స్ (Marshall Islands) కు చెందిన Safesea Vishnu సేఫ్‌సీ విష్ణు నౌక, ఇరాక్ లోని ఖోర్ అల్ జుబైర్ (Khor Al Zubair) రేవు సమీపంలో చమురును లోడ్ చేసుకుంటోంది. మాల్టా (Malta) దేశపు Zefyros (జెఫైరోస్) నౌక ఇరాక్ లోని బస్రా గ్యాస్ కంపెనీ (Basra Gas Company) నుంచి కండెన్సేట్ (Condensate) లోడ్ చేసుకుని బయలుదేరింది. బుధవారం అర్ధరాత్రి ఇరాన్ ఆత్మాహుతి డ్రోన్లు, బోట్లతో దాడి చేసింది.

ఈ దాడిలో చమురు ట్యాంకర్ సేఫ్‌సీ విష్ణు (Safesea Vishnu) నౌక లో మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. 27 మందిని సురక్షితంగా రక్షించారు.ఏపీకి చెందిన రవికుమార్ అక్కడిక్కడే మృతి చెండాడు. ఇరాక్ దళాలు రక్షించిన బాధితులను ఇరాక్‌లోని బస్రా (Basra) నగరానికి తరలించినట్లు సమాచారం. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ఈ ఘటనను నిశితంగా గమనిస్తోంది. బస్రాలోని భారత రాయబార కార్యాలయం ద్వారా భారతీయులకు అవసరమైన వైద్య సహాయం, స్వదేశానికి తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Iran Suicide Drones : ఇండియన్ టోల్ 6

పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో 28 భారతీయ నౌకలు (778 మంది భారతీయ నావికులతో) చిక్కుకుపోయారు. మార్చి మొదటి వారంలో ముగ్గురు భారతీయ నావికులు మరణించగా, తాజాగా మార్చి 11న జరిగిన దాడుల్లో మరో ఇద్దరు భారతీయులు మరణించారు. ఒకరి జాడ లేదు. MKD VYOM అనే నౌకపై ఓమన్ తీరంలో ఇరాన్ అనుబంధ దళాలు జరిపిన డ్రోన్ దాడిలో ఒక భారతీయుడు మరణించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.MV Skylight , Mayuree Naree వంటి నౌకలపై జరిగిన దాడుల్లో ఇతర భారతీయులు మరణించారు., దుబాయ్, ఇజ్రాయెల్ ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు దాడుల్లో మరికొంతమంది భారతీయులు గాయపడ్డారు. ఈ దాడుల్లో నౌకల్లో థాయ్‌లాండ్ నౌక Mayuree Naree , మార్షల్ ఐలాండ్స్ నౌక MKD VYOM దెబ్బతిన్నాయి. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలోని వివిధ నౌకలపై జరిగిన దాడుల్లో5గురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. బీహార్ కు చెందిన కెప్టెన్ ఆశిష్ కుమార్ (Captain Ashish Kumar): , మార్చి 1న ఒమాన్ సమీపంలో ‘MV Skylight’ నౌకపై జరిగిన దాడిలో మరణించారు. ‘MV Sky light’ నౌకలో పనిచేస్తున్న రాజస్థానీ దిలీప్ సింగ్ ఇదే దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఒమాన్ తీరంలో మార్చి 2 న ‘MKD Vyom’ అనే నౌకపై దాడి జరిగింది. ఓడ ఇంజిన్ రూమ్‌లో ముంబైకి చెందిన దీక్షిత్ సోలంకి (Dixit Solanki): చని పోయాడు.
Iran Suicide Drones : ఇది ఆత్మరక్షణ.. ఇరాన్ ప్రకటన

ఇరాన్ ప్రభుత్వం ఈ దాడులను తన “ఆత్మరక్షణ” చర్యగా అభివర్ణించింది: తమ దేశంపై ఇజ్రాయెల్ , అమెరికా జరుపుతున్న దాడులకు ప్రతిస్పందనగానే ఈ చర్యలు తీసుకున్నట్లు ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. పర్షియన్ గల్ఫ్ , హార్ముజ్ జలసంధిలో తమ అనుమతి లేకుండా తిరిగే ఏ విదేశీనౌకైనా తమకు లక్ష్యమేనని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ (IRGC) ప్రకటించింది. శాంతి స్థాపన జరగాలంటే ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలని, అమెరికా తన దళాలను ఉపసంహరించుకోవాలని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ డిమాండ్ చేశారు.
Iran Suicide Drones : ఇరాన్ తప్పు చేస్తోంది

ఈ దాడులను అనాగరిక చర్యగా అమెరికా: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. “ఇరాన్ తప్పు చేస్తోంది, భారీ మూల్యం తప్పదు, అని ఆయన వైట్ హౌస్ నుండి గర్జించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది.

ఇరాన్ చర్యలను ఖండిస్తూ తీర్మానించింది. ఈ తీర్మానానికి భారతదేశం సహా 135 దేశాలు మద్దతు తెలిపాయి. వెంటనే కాల్పుల విరమించాలని UN సెక్రటరీ జనరల్ కోరారు. ఈ దాడుల్లో ఒక భారతీయ సిబ్బంది మరణించినట్లు వార్తలు రావడంతో భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో ఉన్న భారతీయుల భద్రతపై నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలిపింది.
ALSO READ : Operation Revange : పశ్చిమాసియా లబోదిబో Andhra Prabha News
