Raviteja | ఇరుముడి.. సక్సెస్ అందించేనా..?

Raviteja | ఇరుముడి.. సక్సెస్ అందించేనా..?
Raviteja | వరుస ప్లాపుల తర్వాత రవితేజ రూటు మార్చాడా?
అయ్యప్ప భక్తుడి పాత్రలో రవితేజ.. ఇరుముడి ప్రత్యేకత ఇదే
ప్రియా భవాని శంకర్ తో పాటు మరో హీరోయిన్ పాత్ర
ఇరుముడిలో తమన్నా ఎంట్రీ.. క్రేజ్ పెంచే ప్లాన్
శివ నిర్వాణ ప్రెజెంటేషన్ తో మాస్ రాజాకు సక్సెస్ వస్తుందా?
Raviteja | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాస్ మహారాజా ఒకప్పుడు వరుసగా సక్సెస్ సాధించాడు. ఇప్పుడు వరుసగా ప్లాపులు అందిస్తున్నాడు. ఆయన నుంచి వచ్చే సినిమాలు రొటీన్ గా ఉంటున్నాయని.. ఏమాత్రం కొత్తదనం ఉండడం లేదనే కంప్లైంట్ ఉంది. ఈమధ్య కాలంలో రవితేజ నుంచి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి కానీ.. ఏమాత్రం ఆకట్టుకోలేదు. అయితే.. ఇప్పుడు ఇరుముడి అనే డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతకీ.. ఈ సినిమా గురించి బయటకు వచ్చిన న్యూస్ ఏంటి..? మరి.. ఈ మూవీ అయినా మాస్ రాజాకి సక్సెస్ అందించేనా..?

మాస్ మహారాజా రవితేజ నుంచి ఈమధ్య కాలంలో వచ్చిన మిస్టర్ బచ్చన్, మాస్ జాతర, భర్త మహాశయులకు విజ్ఞప్తి తదితర చిత్రాలు ఏవీ కూడా విజయాన్ని అందివ్వలేదు. అందుకనే రవితేజ రూటు మార్చి ఇరుముడి అనే సినిమా చేస్తున్నారు. దీనికి శివ నిర్వాణ డైరెక్టర్. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఇందులో రవితేజ అయప్పస్వామి భక్తుడుగా నటిస్తుండడం విశేషం. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాత అందరి దృష్టిని ఆకర్షించింది. మూవీ పై మరింత బజ్ క్రియేట్ అయ్యింది.

ఈ సినిమా గురించి బయటకు వచ్చిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఇందులో రవితేజకు జంటగా ప్రియా భవాని శంకర్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉందట. ఆ కీలక పాత్ర కోసం.. మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. తమన్నా తెలుగులో భారీ చిత్రాల్లో నటించి చాన్నాళ్లు అయ్యింది. అలాగే రవితేజ సినిమాలో తమన్నా బెంగాల్ టైగర్ తర్వాత మళ్లీ నటించలేదు. ఇప్పుడు ఇరుముడిలో తమన్నా నటిస్తే కనుక మరింత క్రేజ్ రావడం ఖాయం. మాస్ రాజాను శివ నిర్వాణ సరికొత్తగా ప్రజెంట్ చేస్తుండడంతో.. ఇరుముడి మూవీ ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి.. ఈ సినిమా అయినా రవితేజకు ఆశించిన బ్లాక్ బస్టర్ అందిస్తుందేమో చూడాలి.

