Ap Cs Task : క‌లిసి ప‌నిచేద్దాం Andhra Prabha News

Ap Cs Task : క‌లిసి ప‌నిచేద్దాం Andhra Prabha News

  • క‌లిసి సాధిద్దాం
  • ప్రపంచానికే క్వాంటం వ్యాలీ ఆద‌ర్శం
  • 2.4 ట్రిలియ‌న్ ఎకాన‌మీ గ్యారెంటీ
  • ఆ దిశ‌గానే ఏపీ ఎద‌గ‌బోతోంది
  • రూ.55 ల‌క్ష‌ల త‌ల‌స‌రి ఆదాయ సాధ‌నే ల‌క్ష్యం
  • ప్ర‌భుత్వ ఆశ‌యాలు సాధ‌న‌కు కృషి చేద్దాం
  • వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ వినియోగం పెంచుదాం
  • క‌లెక్ట‌ర్ల‌కు ఏపీ సీఎస్ టాస్క్

(ఆంధ్ర‌ప్ర‌భ‌, ఏపీ న్యూస్ నెట్ వ‌ర్క్ ప్ర‌తినిధి)

ప్ర‌భుత్వ ఆశ‌యాలు, ఆకాంక్ష‌ల‌ను ప్ర‌తిఫ‌లించేవిదంగా అధికారులు అంతా క‌లిసి పనిచేసి, క‌లిసి సాధించేలా వ్య‌వ‌హ‌రించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జి. సాయి ప్ర‌సాద్ జిల్లా క‌లెక్ట‌ర్లు, అధికారుల‌కు సూచించారు. జిల్లా క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో ఆయ‌న ప్రారంభోప‌న్యాసం చేస్తూ ప్ర‌భుత్వ ఆశ‌యాలు, ల‌క్ష్యాల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు వివ‌రించారు. ప్ర‌భుత్వ విధానాల‌ను మ‌రింత మెరుగైన రీతిలో అమ‌లు చేసేందుకు అధికారుల ప‌నితీరు మ‌దింపు వేసేందుకు ఈ స‌మావేశం దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు.

Ap Cs Task : రూ.55 ల‌క్ష‌లే త‌ల‌స‌రి ఆదాయం ల‌క్ష్యం

స్వ‌ర్ణాంధ్ర‌ప్ర‌దేశ్ ల‌క్ష్య సాధ‌న‌లో భాగంగా రూ.55 ల‌క్ష‌ల త‌ల‌స‌రి ఆదాయం సాధించే దిశ‌గా ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని దీనికి అధికార యంత్రంగం చిత్త‌శుద్దితో ప‌ని చేయాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని చెప్పారు. 2.4 ట్రిలియ‌న్ ఎకాన‌మీ దిశ‌గా రాష్ట్రం ప‌య‌నిస్తోంద‌న్నారు. ప్ర‌భుత్వ సేవ‌ల కోసం పౌరులెవ్వ‌రూ కూడా ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా వారి మొబైల్ ఫోను ద్వారానే ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ పోందేలా ముఖ్య‌మంత్రి ఒక స‌దాశ‌యంతో మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వర్నెన్స్‌ను తీసుకొచ్చార‌న్నారు. దీన్ని ప్ర‌జ‌లంతా స‌మ‌ర్థ‌వంతంగా ఉపయోగించుకునేలా, మ‌న‌మిత్ర ఎక్కువ‌గా వినియోగించుకునేలా జిల్లా క‌లెక్ట‌ర్లు చర్య‌లు తీసుకోవాల‌న్నారు.

Ap Cs Task : పెట్టుబ‌డులు ఆక‌ర్షిద్దాం

రాష్ట్రంలో పెట్ట‌బుడులు రావ‌డానికి అవ‌స‌ర‌మైన సంస్క‌ర‌ణ‌లు, చ‌ర్య‌లు, విధానాల‌ను స‌మ‌గ్రంగా అవ‌లంభించాల‌న్నారు. ప్ర‌భుత్వం రూపొందించిన విధానాల‌ను స‌మ‌ర్థంగా అమ‌లు చేయ‌డం ద్వ‌రానే ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నాలు అందుతాయ‌న్నారు. క్వాంటం వ్యాలీ ఏర్పాటుతో కంప్యూటింగ్ రంగంలో అమ‌రావ‌తి దేశంలోనే అగ్ర‌స్థానంలోనే నిలుస్తోంద‌ని చెప్పారు.

Ap Cs Task : క్వాంటం వ్యాలీ.. ప్ర‌పంచానికే ఆద‌ర్శం

క్వాంటం వ్యాలీ దేశానికి, ప్ర‌పంచానికి ఒక ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రస్థాయిలో రూపొందించిన విధ‌నాలు, ల‌క్ష్యాల‌ను క్షేత్ర‌స్థాయిలో స‌మ‌ర్థంగా అమ‌లు చేసేలా ఈ కలెక్ట‌ర్ల స‌ద‌స్సు ఉప‌క‌రిస్తుంద‌ని చెప్పారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆలోచ‌న‌ల్ని, నిర్దేశించిన ల‌క్ష్యాల‌ను క్షేత్ర‌స్థాయిలో స‌మ‌ర్థంగా అమ‌లు చేద్దామ‌ని తెలిపారు. పీపీపీ విధానంలో కూడా వివిధ ప్రాజెక్టుల‌ను అమ‌లు చేసి ప్ర‌జ‌ల‌కు మెరుగైన సేవ‌లు అందిచేలా ప‌నిచేద్దామ‌న్నారు. ప్రైవేటు రంగాన్ని అనుమాన కోణంలో చూడ‌వ‌ద్ద‌ని కోరుతున్నా, వారిని కూడా పాల‌నలో భాగ‌స్వామ్యం చేసి, స‌త్ఫ‌లితాలు సాధించే దిశ‌గా ప‌నిచేయాల‌ని ఆయ‌న సూచించారు.