డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కలిసికట్టుగా పనిచేయాలి
డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కలిసికట్టుగా పనిచేయాలి
- పిల్లలపై తల్లిదండ్రులు నిత్యం పర్యవేక్షణ చేయాలి
- డ్రగ్స్‌తో పాటు సెల్ఫోన్లకు యువత బానిసలు కాకూడదు
- అనుమానాస్పద కాల్స్ వస్తే 1930కు ఫిర్యాదు చేయాలి…
- డ్రగ్స్ సమాచారానికి 1908 నెంబర్ కు చేయండి
- ఇప్పగూడెం, పాంనూరు గ్రామాల్లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం
- ట్రేని ఐపీఎస్ మనీషా నెహ్ర
స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరూ కలిసికట్టుగా పనిచేయా లని ట్రేని ఐపీఎస్ మనీషా నెహ్ర అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వరంగల్ కమిషనర్ ఆదేశాల మేరకు స్టేషన్ ఘన్ పూర్ మండలం ఇప్పగూడెం, పాంనూరు గ్రామాల్లో మంగళవారం స్టేషన్ ఘన్పూర్ సీఐ జి. వేణు అధ్యక్షతన ఓ యువత మేలుకో…డ్రగ్స్ మానుకో అనే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిధిగా ట్రేని ఐపీఎస్ మనీషా నెహ్ర హాజరై మాట్లాడారు. పిల్లలను మందలించడానికి ముందు ప్రేమతో దగ్గరగా కూర్చోపెట్టి మాట్లాడండి. పిల్లలు ఎటు వెళ్తు న్నారు.
ఎవరితో తిరుగుతున్నారనే విషయాలను గమనించడం తల్లి దండ్రుల బాధ్యతన్నారు. మత్తు పదార్థాలు జీవితం ఎలా నాశనం చేస్తా యో ఉదాహరణలతో వివరిం చాలని పేర్కొన్నారు. డ్రగ్స్ తో పాటు సెల్ ఫోన్లకు కూడా యువత బానిసలు కాకూడదని పేర్కొన్నారు.. భవిష్య త్ తరాలు సమాజానికి బాధ్యత గల పౌరులుగా ఎదగాలని విద్యా ర్థులకు సూచించారు. సైబర్ క్రైమ్‌లు పెరుగుతున్న నేపథ్యంలో అను మానాస్పద కాల్స్ వస్తే వెంట నే 1930 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.
అత్యవసర పరిస్థితు ల్లో 100, బాలల సమస్యల కోసం 1098 నంబర్లను సంప్రదించాలని తెలిపారు. డ్రగ్స్ అమ్మ కాలు లేదా కొనుగోళ్లపై సమాచారం ఉంటే 19 08 నెంబర్‌కు తెలియజే యాలని చెప్పారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు పోలేపల్లి సంపత్ రెడ్డి, మందపురం రాణి అనిల్, నార్కోటిక్ ఇన్స్పె క్టర్ దిలీప్ కుమార్, వైధ్యాధికారి ప్రణీత, హెచ్ఈఓ భగవాన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి యుగేం దర్, ఉపసర్పంచ్ లింగ నబోయిన రాజు, ఏఏన్ఏంలు సునీత, లత, రాజ్యలక్ష్మి, వనజ, నాయకులు మ్యాదరబోయిన కర్ణాకర్, లింగనబోయిన శ్రీకాంత్, ఆశ వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
