డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్ధాం

డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిద్ధాం
ఏసీపీ ప్రశాంత్ రెడ్డి
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : డ్రగ్స్ రహిత రైతు సమాజాన్ని నిర్మించడమే అందరి లక్ష్యంగా కృషి చేయాలని కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలకేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ విద్యార్థులు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.
ఈగల్ ఫోర్స్ డీఎస్పీ నరసింహరావు మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసలుగా కాకుండా,మంచి భవిష్యత్తు కోసం విద్యార్థులు కష్టపడి చదువుకుని సమాజానికి ఆదర్శంగా నిలవాలని కోరారు.అలాగే యువత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడుపుతూ తమ భవిష్యత్తును సుస్థిరంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో 66వడివిజన్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్, సీఐ వట్టే చేరాలు చేరాలు,ఎస్ఐ దేవేందర్, ఎక్సైజ్ శాఖ ఎస్ఐలు వెంకన్న,చందు బిజెపి మండల అధ్యక్షులు మారం తిరుపతి, మేకల హరిశంకర్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు కిరణ్, వీసం సురేందర్ రెడ్డి, తాళ్ల మధు గరిగె రాజు విద్యార్థులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు, యువత తదితరులు పాల్గొన్నారు.
