ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ లకు దూరంగా ఉండండి..

ఇంస్టాగ్రామ్ ఫేస్ బుక్ లకు దూరంగా ఉండండి..

రాప్తాడు,ఆంధ్రప్రభ: మహిళల హక్కులు భారత రాజ్యాంగ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించామని రాప్తాడు డిఎస్పీ మహబూబ్ భాషా పేర్కొన్నారు. రాప్తాడు మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామం దగ్గర ఉన్న మాంటిస్సోరి ఎలైట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు అనంతపురం రూరల్ సబ్ డివిజన్ శక్తి టీం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.

ఈ సంధర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ.. ప్రస్తుత సమాజంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను సురక్ష వాహనంలో డిజిటల్ స్క్రీన్ పై సైబర్ క్రైమ్ రోడ్ సేఫ్టీ గురించి స్క్రీన్ మీద వీడియోస్ ప్లే చేయించి చూపించామని తెలిపారు.ముఖ్యంగా వాట్సప్ ఫేస్ బుక్ ఇంస్టాగ్రామ్ లకు విద్యార్థులు మహిళలు దూరంగా ఉండాలన్నారు. అపరిచిత వ్యక్తులతో ఫోటోలు దిగడం వలన ఫోటోను మార్పింగ్ చేసి బ్లాక్ మెయిల్ ఎలా చేస్తున్నారు వివరించమన్నారు.

బాలికలు తమను తాము ఎలా రక్షించుకోవాలి సైబర్ నేరాలు ఏటీఎం మోసాలు డ్రగ్స్ వాడకం ఫేక్ కాల్స్ బ్యాంకుల పేరుతో నకిలీ ఫోన్ కాల్స్ ఓటిపి వంటి వాటి గురించి విద్యార్థులకు క్వప్తంగా వివరించాము.ప్రమాద సమయాల్లో 100 లేదా112 లేదా1098 లేదా181 ఫోన్ నెంబర్లుకు ఫోన్లు కచ్చితంగా చేయాలని తెలియజేశాము.

ఈ కార్యక్రమంలో పాఠశాల మాంటిస్సోరి ఎలైట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ డైరెక్టర్ కృష్ణ భరత్ కరస్పాండెంట్ కృష్ణ సమీరా ప్రిన్సిపల్ ప్రతాప రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply