తొర్రూరు టౌన్ సదస్సు కరపత్ర ఆవిష్కరణ…

తొర్రూరు టౌన్ సదస్సు కరపత్ర ఆవిష్కరణ…

తొర్రూరు టౌన్, ఆంధ్రప్రభ : భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో సాంకేతికత మరియు వ్యాపార ఆవిష్కరణల పాత్రపై ఈ సెమినార్ దిశానిర్దేశం చేయనుంది.” అని తొర్రూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 13న (శుక్రవారం) భారీ జాతీయ సెమినార్ నిర్వహించను న్నారు. పిఎం-యూ ఎస్ హెచ్ ఏ (ఆర్ యూ ఎస్ ఏ) సౌజన్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏ . ఐ)ద్వారా వ్యాపారంలో ఆవిష్కరణ, స్థిరత్వం వికసిత్ భారత్ 2047 కోసం మల్టీ డిసిప్లినరీ రోడ్‌మ్యాప్” అనే అంశంపై ఈ సదస్సు జరగనుందని చెప్పారు.

ముఖ్య అతిథులుగా ఈ కార్యక్ర మానికి పాలకుర్తి నియోజకవర్గ శాసనస భ్యురాలు యశస్వినిరెడ్డి మామిడాల ముఖ్య అతిథిగా విచ్చేసి సదస్సును ప్రారంభించ నున్నారని ,విశిష్ట అతిథిగా నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి హాజరవుతారని చెప్పారు. ప్రధాన వక్త గా వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయ కామర్స్ , బిజినెస్ మేనేజ్‌మెం ట్ విభాగం డీన్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ విచ్చేసి, కృత్రిమ మేధ (ఏఐ) భవిష్యత్తులో వ్యాపార రంగంలో తీసుకురాబోయే విప్లవాత్మక మార్పుల గురించి తెలియజే స్తారని చెప్పారు.

సెమినార్ డైరెక్టర్ ప్రిన్సిపాల్ డాక్టర్ బి. రాములు ,కో-డైరెక్టర్ డాక్టర్ జి. సుజాత (వాణిజ్య విభాగాధిపతి)కన్వీనర్ ,ఆర్గనైజింగ్ సెక్రటరీ అసిస్టెంట్ ప్రొఫెసర్) డాక్టర్ ఆర్. సునీల్ ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఖమ్మం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపా ల్ డాక్టర్ బానోత్ రెడ్డి, కళాశాల ఐ క్యు ఏ ఎస్ కోఆర్డినేటర్ వై. రవీంద్రా రెడ్డి తదితరులు పాల్గొంటారని తెలిపా రు. భారతదేశాన్ని 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడంలో సాంకేతికత, వ్యాపార ఆవిష్కరణల పాత్రపై ఈ సెమినార్ దిశానిర్దేశం చేస్తుందన్నారు.

Leave a Reply