చీపురు పట్టిన సర్పంచ్…. వీధుల శుభ్రం…
చీపురు పట్టిన సర్పంచ్…. వీధుల శుభ్రం…
జుక్కల్(కామారెడ్డి) ఆంధ్రప్రభ : ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజాపాలన,గ్రామప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా జుక్కల్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సావిత్రిసాయగౌడ్ చీపిరి పట్టారు.ఎంపీడీఓ బి.శ్రీనివాస్, మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కే.సాయగౌడ్, కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్, పంచాయతి కార్మికులతో కలిసి అంగన్వాడీ కేంద్రల్లో, ప్రాథమిక పాఠశాల ఆవరణతోపాటు ప్రధాన విధులలో ఉన్న చెత్తచెదరాన్ని ఊడ్చి శుభ్రం చేశారు.
పంచాయతీ కార్మికులతో మురికి కాలువలను శుభ్రం చేయించారు. జుక్కల్ ను చెత్త రహితగ్రామంగా తీర్చిదిద్దు కొందామని, గ్రామస్తులు తమవంతు సహకారం అందించలని ఆమె కోరారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతపై గ్రామస్తులందరూ దృష్టి సారించాలన్నారు.
