మూగజీవాలకు టీకాలు వేయించాలి…

మూగజీవాలకు టీకాలు వేయించాలి…

చిట్యాల, ఆంధ్రప్రభ : పాడి రైతులు మూగజీవాలకు గాలికుంటు వ్యాధి నిర్మూలనకు నిరోధక టీకాలను తప్పనిసరిగా వేయించాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్ పందిరి గీత అన్నారు. మంగళవారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధి చిట్యాల మున్సిపాలిటీ లో ఎనిమిదవవిడత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం ఆరవ వార్డులో పశుసంవర్ధ శాఖ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి చైర్మన్ పందిరి గీత హాజరై రిబ్బన్ కట్ చేసి గాలికుంటు నిర్మూలనటీక కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం మూగజీవాలకు వెటర్నరీ డాక్టర్ బి.ఆర్ అభినవ్ మాట్లాడుతూ మొత్తం 101 మూగజీవాలకు ఈ శిబిరంలో గాలికుంటు నిర్మూలన టీకాలు వేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ జెర్రిపోతుల సత్యనారాయణ, ఉరుమడ్ల పశు వైద్యాధికారి డాక్టర్ అమరేందర్, పశు వైద్య గణాంక అధికారి శ్రీనివాస్, పశు వైద్య సిబ్బంది మల్లారెడ్డి, గోపాలమిత్ర సత్యనారాయణ, నరసింహ, వెంకన్న, సతీష్, సత్తయ్య, పాడి రైతులు పాల్గొన్నారు.

Leave a Reply