పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి …

పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలి …

సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన …

బచ్చన్నపేట, ఆంధ్రప్రభ : కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం పార్టీ చిన్న రామన్ చర్ల గ్రామశాఖ ఆధ్వర్యంలో ఆందోళన నిరసన కార్యక్రమాన్నీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ మండల సీనియర్ నాయకులు రామగల్ల అశోక్ మండల కమిటీ సభ్యులు అన్న బోయిన రాజులు మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల నడ్డి విరిచి అలాగే లేబర్ కోడు చట్టాలను తీసుకొచ్చి కార్మికుల హక్కులను కాలరాశి ఇప్పుడు పేద ప్రజలపై గ్యాస్ ధరలను పెంచి ఈ దేశంలోని ప్రజల బతుకులను వెనక్కి నెట్టేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజలు విసిగి వేసారి పోయారని కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలు మార్చుకోకపోతే భవిష్యత్తులో మనుగడ సాగించలేదని పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శి బుర్రి సుధాకర్, నాయకులు కొత్తపల్లిబాల నరసయ్య, గుడికందుల కనకయ్య, కంత్రి ఐలయ్య , గంధమాల మనోహర్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు…

Leave a Reply