సమస్యలు పరిష్కరించాలని ధర్నా..

సమస్యలు పరిష్కరించాలని ధర్నా..

గుడివాడ, ఆంధ్రప్రభ : గుడివాడ టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో 100 మంది మహిళలతో సి 96 బ్లాక్ వద్ద టిడ్కో ఋణమాఫి చేసి.. మహిళా సాధికారత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా టిడ్కో కాలనీ అభివృద్ధి కమిటీ కార్యదర్శి బసవ అరుణ మాట్లాడుతూ.. టిడ్కో కాలనీలో 50 బ్లాక్ ల్లో 500 మందికి బ్యాంక్ ఆఫ్ బరోడా నందివాడ, దోసపాడు శాఖలు మిగిలిన బ్యాంకులు బ్లాక్ ల వద్ద ఇళ్లకు నోటీసులు అంటించి, ఇళ్లకు పోస్టులు పంపారని, దీనిని దీటుగా తిప్పి కొడతామని హెచ్చరించారు. ప్రతి మహిళకు ఏకౌంట్ 1500 వేయాలని, డ్వాక్రా ఋణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

అనంతరం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో టిడ్కో అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు ఆర్.శివారాంప్రసాద్, అప్పలనాయుడు, రాంబాబు, హైమవతి, దుర్గ తదితరులు మాట్లాడుతూ.. 3 లక్షల ఆదాయ పరిమితి వర్గాలకు పెట్టిన టిడ్కో స్కీంలో తెల్ల కార్డుదారుల ఆదాయ పరిస్థితి తెలుసుకోకుండా బ్యాంక్ ల వారు ఇనకం రెపమెంట్ కెపాసిటీ తెలుసుకోకుండా ముందు వెనుక చూడకుండా రుణాలు మంజూరు చేసారని 90% అందులో దిగువ అల్ప ఆదాయ వర్గాలేనని అన్నారు. వీరందర్నీ సమీకరించి పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు.