అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు

అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు

నిజామాబాద్ ,ఆంధ్రప్రభ : ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నర్సింగపల్లి ఇందూరు తిరుమలలో మొదలైన 12వ (పుష్కర) బ్రహ్మోత్సవాలు. యజ్ఞాచార్యులు సముద్రాల శ్రీనివాసచార్యులు బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయగ ఆదివారం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నర్సింగ్ పల్లి గ్రామస్తులు శ్రమదానం చేయగా.. శ్రీమాన్ నరసింహారెడ్డి సంకల్ప బలంతో, దిల్ రాజు కుటుంబ సభ్యులు అకుంఠిత దీక్షతో ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రం ఆలయం నిర్మాణం చేపట్టి 12 సంవ త్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా “పుష్కర బ్రహ్మోత్సవాలను ఆంగ రంగ వైభవంగా ప్రారంభించారు.

ఇందూరు తిరుమల ఆలయం ఆలయానికి స్వామివారు వేం చేసి 12 సంవత్సరాలు పూర్తయి పదమూడవ సంవత్సరంలో అడుగిడుతున్న ఈ శుభ సంద ర్భంలో పుష్కర బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందని అర్చక స్వాములు రోహిత్ కుమారాచార్య అన్నారు. ఆలయం ఏర్పడి 12 సంవత్సరాలు పూర్త యినాక స్వామివారి ప్రాభ వం రెట్టింపుగా ఉంటుం దని అన్నారు. ఈ బ్రహ్మో త్సవాల్లో భక్తులు పాల్గొం టే సకల శుభాలు కలు గుతాయని అన్నారు.

బ్రహ్మోత్సవాలంటే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వేంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమని, లోకకళ్యాణార్థం చేస్తున్న బ్రహ్మోత్సవాలు అంటే స్వామికి అత్యంత ప్రీతిక రమనిఅన్నారు. బ్రహ్మో త్సవాల్లో పాల్గొంటే అధిక పుణ్య ఫలమని అన్నారు. అదే విధంగా ఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాలు అత్యంత కనులపండుగగ జరగడం ఈ ప్రాంతానికి సుభిక్షం అని అన్నారు.


ఈ కార్యక్రమంలో యజ్ఞా చార్యులు సముద్రాల శ్రీనివాసాచార్యులు, ఆలయ ధర్మకర్తలు నర్సిం హ్మ రెడ్డి, విజయసిం హారెడ్డి, సంపత్ కుమా రాచార్య, రోహిత్ కుమా రాచార్య, నరాల సుధాకర్, నర్సారెడ్డి, రమేష్, ముర ళి, భాస్కర్, సురేష్, గంగారెడ్డి, సాయిలు, సాయి గ్రామస్తులు పాల్గొన్నారు

Leave a Reply