Gravel | అక్రమ గ్రావెల్ తరలింపుకు తెర…

Gravel | అక్రమ గ్రావెల్ తరలింపుకు తెర…

Gravel | వీరులపాడు, ఆంధ్రప్రభ : అక్రమ గ్రావెల్ తరలింపుకు తెరలేపిన కూటమినేతపై మండిపడుతున్న అధికార పార్టీ నేతలు.వీరు లపాడు మండలం తిమ్మాపురం గ్రామ శివారులో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమ గ్రావెల్ తరలింపుకు ఓ గ్రామ పార్టీ నేత తెరలేపాడు. అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ తరలింపు యదేచ్చగా కొనసాగుతున్న అధికారులు అటు వైపు కన్నెత్తి చూడకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గత మూడు రోజుల నుంచి పగలు రాత్రి తేడా లేకుండా గ్రావెల్ తోలకాలు నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో కొంతమంది అధికార పార్టీ నాయకుల కారణం గా ప్రభుత్వానికి మచ్చ వస్తుందంటూ సీనియర్ నేతలు వాపోతున్నారు. గ్రామాల్లో గ్రావెల్ అవసరాలు ఉంటే అనుమతులు తీసుకోవాలంటూ సీఎం పదేపదే చెబుతున్న అధికార పార్టీ నేతలు మాత్రం సీఎం ఆదేశాలను పెడచెవిన పెడుతూ మాఫియాకు తెర లేపుతున్నారు. అక్రమ గ్రావెల్ రవాణాకు పాల్పడే నేతలపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో కూటమి పార్టీకి మరింత మచ్చ వచ్చే అవకాశం లేక పోదంటూ విశ్లేషకుల మాట.

Gravel |
Gravel |

మూడు రోజుల నుంచి అక్రమ గ్రావెల్ తోలకాలు జోరుగా జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు నెలకొన్నాయి. అక్రమ గ్రావెల్ రంగాపురం, గూడెం మాధవరం, పెద్దాపురం గ్రామాలకు తరలించి లక్షలాది రూపాయల గడిస్తున్నారనే ఆరోపణలు లేక పోలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమంగా గ్రావెల్ ను తరలించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ పలు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.

 Gravel |

Leave a Reply