మహిళల అభ్యున్నతికి సావిత్రిబాయి పూలే స్ఫూర్తి
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలోని మహనీయుల విగ్రహాల వద్ద పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో ప్రపంచ శ్రామిక మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేదిక ఉపాధ్యక్షురాలు అక్కు ఉమ అధ్యక్షత వహించగా, రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ శంకర్, వేదిక అధ్యక్షులు గొడిసెల శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు.
మహిళలు నేడు అన్ని రంగాల్లో ఉన్నత స్థాయిలో ఉన్నారంటే దానికి సావిత్రిబాయి పూలే చేసిన కృషే కారణమని వారు కొనియాడారు. 1910లో క్లారా జట్కిన్, రోజా లగ్జెంబర్గ్ ఆధ్వర్యంలో మహిళా కార్మికుల పోరాట ఫలితంగా ఈ దినోత్సవం ఆవిర్భవించిందని, నేటి తరం మహిళలు పూలే, అంబేద్కర్, పెరియార్ బాటలో ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు షేక్ సిమ్రాన్, ఈట కమల, చంద్రవెల్లి సర్పంచ్ జంబి మౌనిక, లంబడి తండా ఉపసర్పంచ్ జీళ్ళ రజిత, వార్డు మెంబర్స్ కందుల వసుంధర, రంగ శ్రీలత, బెల్లంపల్లి మండల సమైక్య అధ్యక్షురాలు కుచ్చుల లావణ్య, అంగన్వాడి టీచర్ అంజు, ఆశ వర్కర్ యశోద, అంగన్వాడి ఆయా లక్ష్మి, నెన్నల మండల సమైక్య అధ్యక్షురాలు గోలేటి సంధ్య, చాకపల్లి వార్డు సభ్యులు కమల, మాధవి తదితరులను వారు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రంగ ప్రశాంత్, కోశాధికారి డాక్టర్ శ్రీధర్, కార్యదర్శి అక్కు కృష్ణ, ఉపాధ్యక్షులు దుబాసి రవి, గొడిసెల చంద్రమౌళి, ఉండ్రాళ్ల రవి, ఏఐటీయూసీ నాయకులు దాగం మల్లేష్, దుర్గం గోపాల్, శ్రీనాథ్, జ్యోతికుమార్, లలిత, రేణుక, పూజ, ప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.
