9న తోట్ల ఎల్లమ్మ దేవస్థానం ప్రథమ వార్షికోత్సవం

వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఎన్నో పల్లిలో గల తోట్ల ఎల్లమ్మ ఆలయ ప్రథమ వార్షికోత్సవం సోమవారం 9వ తేదీ ఉదయం 6 గంటల నుండి నిర్వహించడం జరుగుతుందని ఆలయ ధర్మకర్త మాజీ కౌన్సిలర్ రత్నారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదం పొందాలని ఆయన కోరారు.
