Trisha | విజయ్ పార్టీలో చేరనుందా..?

Trisha | విజయ్ పార్టీలో చేరనుందా..?

Trisha | త్రిష రాజకీయాల్లోకి రానుందా..?
టీవీకే పార్టీలో త్రిష చేరికపై ప్రచారం
చెన్నై నుంచి పోటీ చేయనున్న త్రిష..?
విజయ్‌తో అనుబంధం కారణంగా రాజకీయ ఎంట్రీ..?
అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూపులు

Trisha | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కోలీవుడ్ స్టార్, టీవీకే పార్టీ అధినేత విజయ్, స్టార్ హీరోయిన్ త్రిష.. ఈ ఇద్దరి గురించి వార్తలు రావడం.. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం తెలిసిందే. ఇక ఇద్దరూ కలిసి ఓ మ్యారేజ్ రిసెప్షన్ కి వెళ్లడం అయితే.. సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ (Hot Topic) అయ్యింది. అయితే.. ఈ ఇద్దరి గురించి ఎలాంటి వార్తలు వస్తున్నా.. తగ్గేదేలే అన్నట్టుగా విజయ్ ముందుకు వెళుతున్నాడు కానీ.. ఎక్కడా తగ్గడం లేదు. ఇదిలా ఉంటే.. తాజాగా త్రిష రాజకీయాల్లోకి రాబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి.. నిజంగానే త్రిష రాజకీయాల్లోకి రాబోతుందా…?

Trisha

Trisha | చెన్నై నుంచి త్రిష పోటీ..?

తమిళనాడు రాజకీయాల్లో త్రిష పొలిటికల్ ఎంట్రీ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంతకీ విషయం ఏంటంటే.. విజయ్ స్థాపించిన తమిళ వెట్రి కళగం (టీవీకే) పార్టీలో స్టార్ హీరోయిన్ త్రిష (Trisha) చేరబోతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. విజయ్ కు ఉన్న బలమైన ఫ్యాన్ బేస్ కు తోడు.. స్టార్ హీరోయిన్ త్రిష కూడా కలిస్తే.. చెన్నై వంటి పట్టణ ప్రాంతాల్లో యూత్ ని ఆకర్షించడం సులభం అవుతుంది అనుకుంటున్నారని సమాచారం. రాబోయే ఎన్నికల్లో త్రిష చెన్నై నియోజకవర్గం నుంచి బరిలోకి దింపే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

Trisha

Trisha | విజయ్ తో అనుబంధం కారణంగా..

అయితే.. ప్రచారంలో ఉన్న వార్తల పై విజయ్ కానీ, త్రిష కానీ.. ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. తమిళనాడులో రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయరాని అనుభందం ఉంది. అందుచేత ఇలాంటి వార్తలు రావడం కామన్ అనే మాటలు వినిపిస్తున్నాయి కానీ.. విజయ్ (Vijay) తో త్రిషకు ఉన్న అనుబంధం కారణంగా పార్టీలో చేరినా ఆశ్యర్యపోవాల్సింది ఏమీ ఉండదని.. చేరే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. విజయ్ తన పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నాడు. త్వరలోనే భారీ బహిరంగ సభ పెట్టి తన కార్యచరణ్ ప్రకటించనున్నాడని తెలిసింది. ఆ బహిరంగ సభలో త్రిష పొలిటికల్ ఎంట్రీ గురించి క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

Trisha