కారును ఢీ కొట్టడంతో..

కారును ఢీ కొట్టడంతో..

ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎడపల్లి మండలం బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారి పై డి.ఎం ఫంక్షన్ హాల్ ఎదుట ఈ ప్రమాదం జరిగింది. ఎం.ఎస్.సి ఫారం గ్రామానికి చెందిన మంద పవన్ తన పని నిమిత్తం ఎమ్మెస్సీ ఫారం నుండి ఎడపల్లి వెళ్తుండగా, డి.ఎం ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న మూల మలుపు వద్ద ప్రధాన రహదారి పై ఆగి ఉన్న కారును ప్రమాదవశాత్తు ఢీకొట్టాడు. ఈ ఘటనలో పవన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. అనంతరం గాయపడిన పవన్‌ను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply