Temple |ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకలు

Temple |ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకలు

Temple | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంతో పాటు ఉప్లూర్,హస కొత్తూరు,పలు గ్రామాల ఆర్య వైశ్య కుటుంబాల కుల దైవం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ 6వ వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అల్పాహారం, సామూహిక బోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమములో నూతన అధ్యక్షుడు బెజుగం వెంకటేశం, కార్యదర్శి కోట సుధాకర్, క్యాషియార్ జొన్నల భూషణ్, కార్యవర్గ సభ్యులు కటకం భాస్కర్, ఆమెడ నరేందర్, చిటికేసి కిరణ్, ఉత్తర్ రాజేంధర్, నూనెవర్ శ్రీనివాస్‌, హన్మాండ్లు ఆర్య వైశ్య కుటుంబాల వారు పాల్గొన్నారు.

Leave a Reply