ముగిసిన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు

ముగిసిన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు

గంపలగూడెం, ఆంధ్రప్రభ : భక్తుల హరే కృష్ణ..హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే…, ఓం నమో భగవతే వాసుదేవాయ నామస్మరణ నడుమ ఐదు రోజుల పాటు జరిగిన శ్రీ వేణుగోపాల స్వామి 69వ బ్రహ్మోత్సవాలు గురువారం అంగరంగ వైభవంగా ముగిశాయి. అర్చకులు గోపాలాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి ఉదయం అభిషేకాలు నిర్వహించి పుష్పయాగం నిర్వహించారు.

వివిధ వాహనాలపై ఊరేగి అలసి సొలసిన రుక్మిణీ,సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి ప్రత్యేక పూల అలంకరణలో అద్దాల మండపంలో సేద తీరారు. సాయంత్రం ద్వాదశ ప్రదక్షణములు,పవళింపు సేవ కార్యక్రమంతో ఉత్సవాలు ముగిశాయి.ఆలయ సహాయ కమిషనర్ నేల సంధ్య,చైర్మన్ కావూరి శశిరేఖ,ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply