ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేత

పెద్దమందడి, ఆంధ్రప్రభ : పెద్దమందడి మండలం దొడగుంటపల్లి గ్రామానికి చెందిన మేకల వెంకటయ్య–తిరుపతమ్మ, ఈడిమాకుల కృష్ణయ్య–నారమ్మ, కురుమూర్తి లక్ష్మీ కుటుంబాలు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు గురువారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా సొంతింటి కోసం కలలు కనినా ఆర్థిక పరిస్థితులు అనుకూలించక అద్దె ఇళ్లలోనే జీవనం సాగించామని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించి తమకు సొంత ఇల్లు నిర్మించుకునే అవకాశం కల్పించిందని ఆనందం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సహకారంతోనే తమ ఇళ్ల నిర్మాణం త్వరగా పూర్తైందని పేర్కొంటూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ మధుసూదన్ గౌడ్, మాజీ ఎంపీపీలు కిచ్చారెడ్డి, శంకర్ నాయక్, మండల అధ్యక్షుడు రవి కిరణ్, న్యాయవాది తిరుపతయ్య, పీసీసీ సభ్యుడు శంకర ప్రసాద్, గ్రామ నాయకులు పాపిరెడ్డి, పెద్దమందడి మాజీ జెడ్పిటిసి వెంకటస్వామి, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు ఐ. సత్యరెడ్డి, చిన్న మందడి సర్పంచ్ స్వరూప వెంకటస్వామి, దొడగుంటపల్లి సర్పంచ్ కొమ్ము పెంటయ్య, నాయకులు కొత్త కాపుకొత్త కాపు వెంకటేశ్వర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, కొరపాటి సుదర్శన్, పోలేకపాటి శేఖర్ రెడ్డి, బోయ వెంకటేష్.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు పాల్గొన్నారు.
