పెద్దమ్మ తల్లి.. బోనాల పండుగ..

పెద్దమ్మ తల్లి.. బోనాల పండుగ..
చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని ముదిరాజుల ఆరాధ దైవమైన పెద్దమ్మ తల్లికి కులస్తులు బోనాలతో ర్యాలీగా వెళ్లి దేవాలయంలో మొక్కలు చెల్లించారు. పదవ వార్షికోత్సవం సందర్భంగా ముదిరాజ్ సంఘం చిట్యాల ఆధ్వర్యంలో బోనాలతో డప్పు చప్పుడలతో ర్యాలీగా వెళ్లి, ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చిట్యాల ముదిరాజ్ సంగం కమిటీ ప్రెసిడెంట్ గుండ రవీందర్, వైస్ ప్రెసిడెంట్ గోల్కొండ శ్రీనివాస్, డైరెక్టర్లు బండి సాంబయ్య, జట్టి అశోక్, గోలకొండ లక్ష్మి నరసింహ, కుల పెద్దలు పిట్టల రవీందర్, అల్లం సారంగపాణి, గోల్కొండ రాజు, గుండ జనార్ధన్, గువ్వల రవికుమార్, గుండ రంజిత్, అల్లం సారంగ పాణి, సదయ్య తదితరులు పాల్గొన్నారు.
