బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు

బాల్క సుమన్ కు బెయిల్ మంజూరు

చెన్నూర్, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు చెన్నూర్ మున్సిఫ్ మేజిస్ట్రేట్ రవి ఇవ్వాళ బెయిల్ మంజూరు చేసారు. చెన్నూర్ నియోజకవర్గం క్యాతనపెల్లి మున్సిపల్ చేర్మెన్, వైస్ చెర్మెన్ల ప్రమాణ స్వీకారం నియామకం కొరకు గత నెల 16న కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీల మధ్య జరిగిన ఘర్షణలో రాష్ట్రమంత్రి వివేక్ వెంకటస్వామి,పెద్దపెల్లి ఎంపీ వంశీ కృష్ణ ల కాన్వయ్ పై రాళ్ళదాడికి పాల్పడినట్లు బాల్క సుమన్, మూల రాజిరెడ్డిల తో పాటు మరో ఇరువురి పై పోలీసులు కేసు నమోదు అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జిల్లా జైలుకు పంపారు.

13రోజుల అనంతరం మంచిర్యాల జిల్లా కోర్టు లో సుమన్ కు బెల్ మంజూరు అయింది. ఈ క్రమంలోనే మున్సిపల్ ఎన్నికల పోలింగ్ రోజు చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఎన్నికల నిబంధనలు ఉల్లాంఘించరనే ఆరోపణతో ఉన్న కేసులో ఇవ్వాళ చెన్నూర్ మేజిస్టేట్ రవి విచారణ చేపట్టి బెయిల్ మంజూరు చేయడంతో స్థానిక బిఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తూ సుమన్ బెల్ కొరకు ప్రయత్నం చేసిన స్థానిక సీనియర్ న్యాయవాది మల్లేశం గౌడ్ ను కోర్టు వద్దే ఎత్తుకొని సుమన్ జై అంటూ నినాదాలు చేశారు.

మున్సిపల్ ఎన్నికల కారణం గా 14రోజులు జైలుకు వెళ్ళిన సుమన్ రేపు (బుధవారం) బెయల్ పై వస్తున్న సమాచారాన్ని పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Leave a Reply