పెంచిన ఎయిర్ బస్ డ్రైవర్ల వేతనాలు

పెంచిన ఎయిర్ బస్ డ్రైవర్ల వేతనాలు

  • రెండేళ్ల అగ్రిమెంట్పై సంతకాలు

నర్సంపేట, ఆంధ్రప్రభ : నర్సంపేట హైర్ బస్ డ్రైవర్లకు రెండేళ్ల వేతనాలను పెంచినట్లు అసోసియేషన్ ప్రకటించింది. వేతనాల విషయంలో యజమానులతో డ్రైవర్ల యూనియన్ ప్రతినిధులు చేసుకున్న పూర్వ వేతన ఒప్పందం డిసెంబర్ 2025తో ముగియడంతో, నూతన ఒప్పందం కోసం యూనియన్ నాయకులు, యాజమాన్యాల మధ్య చర్చలు జరిగాయి.

పెంచిన నూతన వేతనాల ఒప్పందం ప్రకారం:

పల్లె వెలుగు డ్రైవర్‌కు 15 రోజులకు రూ.18,500 వేతనం.
ఎక్స్‌ప్రెస్ డ్రైవర్‌కు 15 రోజులకు రూ.20,500 వేతనం.
పల్లె వెలుగు టెంపరరీ డ్రైవర్‌కు రోజుకు రూ.1,250.
ఎక్స్‌ప్రెస్ టెంపరరీ డ్రైవర్‌కు రోజుకు రూ.1,400.

దసరా పండుగ సందర్భంగా ఒక సంవత్సరం సీనియారిటీ కలిగిన ప్రతి డ్రైవర్‌కు రూ.2,000 బోనస్ ఇవ్వడానికి అంగీకరించినట్లు తెలిపారు. క్లీనర్‌కు 30 రోజులకు రూ.4,500 వేతనం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ అగ్రిమెంట్ 31 డిసెంబర్ 2028 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. వేతనాలపై 10 శాతం పెంపు చేయాలని ఒప్పందం కుదిరినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు నాగిశెట్టి ప్రసాద్, తెలంగాణ హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు లక్కం ప్రభాకర్, దినేష్, రవీందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, హైర్ బస్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు నల్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కందికొండ రాజు, ప్రధాన కార్యదర్శి కట్ల ప్రశాంత్, కోశాధికారి ఎరుకల రాజు, సోడ రంజిత్ కుమార్, రంజిత్, ప్రకాష్, శ్రీకాంత్, శ్రావణ్ తదితర డ్రైవర్లు పాల్గొన్నారు.

Leave a Reply