మల్లక్కపేట గ్రామంలో పశువైద్య శిబిరం

మల్లక్కపేట గ్రామంలో పశువైద్య శిబిరం

పరకాల, ఆంధ్రప్రభ : జిల్లా పశుగణభివృద్ధి సంస్థ, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పరకాల మండలం లోని మల్లక్కపేట గ్రామంలో ఉచిత గర్భకోశవ్యాధుల చికిత్స శిబిరన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని సర్పంచ్ దొమ్మటి కవిత ప్రారంభించడం జరిగింది. ముఖ్య అతిధిగా డాక్టర్ సంపత్ రావు ఈఓ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ ఈఓ సంపత్ రావు హాజరైనారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ పశువులు ఎదకు వచ్చినపుడు లింగనిర్ధారిత వీర్యంతో కృత్రిమగర్భధారణ చేయడం వల్ల మేలుజాతి ఆడ దూడలు వృద్ధి చెందుతాయని అన్నారు.


రైతులు దూడలకు నట్టల నివారణ మందులు త్రాగించుకోవాలని సూచించారు.ఈ వైద్యశిబిరంలో 36 పశువులకు గర్భధారణ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ వినయ్, వి ఏ ఎస్ చర్లపల్లి, డాక్టర్ శ్రీరామ్, వి ఏ ఎస్ నడికుడ గోపాలమిత్ర సూపెర్వైసర్ ప్రకాష్ రెడ్డి, పశువైద్య సిబ్బంది రవీందర్, లాల్ సింగ్, గోపాలమిత్ర సాంబశివరావు, గోపు సతీష్, కుమారస్వామి మరియు రైతులు అధిక సంఖ్యలొ పాల్గొన్నారు.

Leave a Reply