సీఎంఆర్ ఎఫ్‌ చెక్కులను ఇంటింటికి పంపిణీ….

సీఎంఆర్ ఎఫ్‌ చెక్కులను ఇంటింటికి పంపిణీ….

పెడన – ఆంధ్రప్రభ : ​నిరుపేదల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతగానో దోహదపడుతుందని పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. పెడన టౌన్ నందు ముగ్గురు లబ్ధిదారులకు రూ. 2 లక్షల 16 వేల 186 రూపాయల విలువైన చెక్కులను ఆయన స్వయంగా వారి ఇంటీ వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని సీఎంఆర్ఎఫ్ చెక్కులను పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు.​ఈ విడతలో పెడన నియోజకవర్గంలో 46 మందికి 43,95,309 లక్షలు అర్హులైన లబ్ధిదారులకు అందించడం జరిగిందని అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు చేరేలా కృషి చేస్తామని, ఆపద కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply