February 28 | విద్యార్థుల్లో దాగి ఉన్న మేధాశక్తిని గుర్తించవచ్చు

February 28 | విద్యార్థుల్లో దాగి ఉన్న మేధాశక్తిని గుర్తించవచ్చు

కార్పొరేటర్ మరుపల్ల రవి

February 28 | కరీమాబాద్, ఆంధ్రప్రభ : గ్రేటర్ వరంగల్ కరీమాబాద్ ప్రాంతంలో గల న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమన్ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్స్ ఫెయిర్ కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక కార్పొరేటర్ మరుపల్ల రవి, ప్రత్యేక అతిధిగా వరంగల్ జిల్లా వడుప్సా గౌరవాధ్యక్షులు ఆడెపు శ్యామ్ లుహాజరయ్యారు. కార్పొరేటర్ మాట్లాడుతూ… విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలిక తీయడమే సైన్స్ ఫెయిర్ అని అన్నారు.

వందన హైస్కూల్ కరెస్పాండెంట్ ఆడెపు శ్యామ్ మాట్లాడుతూ నిత్యం తరగతి గదిలో మాత్రమే పాఠ్యాంశాలను బోధించడం కాకుండా ప్రయోగాత్మకంగా పరిశీలనలలో భాగంగా విజ్ఞానో ఉత్పత్తికి ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు. పాఠశాల కరస్పాండెంట్ కోడం శ్రీధర్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ కార్యక్రమం లో దాదాపుగా 450 మంది విద్యార్థిని విద్యార్థులు 196 ఎగ్జిబిట్లను ప్రదర్శించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కోడం సబిత మాట్లాడుతూ రామన్ ఎఫెక్ట్ గుర్తుగా ప్రభుత్వం జాతీయా సైన్స్ డే గా ఫిబ్రవరి 28 ని ప్రకటించిందని అన్నారు విద్యార్థులు శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకుని మేధో మదనం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమ్మక్క గద్దె సారక్క గద్దె , బ్లడ్ గ్రూపింగ్, మ్యాథమెటికల్ మోడల్స్, సౌరశక్తి, భాషాంశాలు, భౌతిక రసాయన శాస్త్రాలు బోనాలు, బతుకమ్మ, తెలుగు పండుగలు వంటి అనేక అంశాలు ఆహుతులను అలరించాయి. కార్యక్రమంలో వడుప్సా జనరల్ సెక్రెటరీ బిల్లా రవి, ట్రెజరర్ టీ జ్ఞానేశ్వర్ సింగ్ లు హాజరై ప్రసంగించారు ‌ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు… ‌

Leave a Reply