Exhibition | విద్యార్థుల సృజనాత్మకత వెలికితియాలి..

Exhibition | విద్యార్థుల సృజనాత్మకత వెలికితియాలి..
శాస్త్రీయ ఆలోచనలు పెంచుకోవాలి
ఘనంగా నేషనల్ సైన్స్ డే’.. విద్యార్థుల అద్భుత ప్రదర్శనలు
విద్యాధికారి రామిరెడ్డి
Exhibition | నందికొట్కూర్, ఆంధ్రప్రభ : నందికొట్కూరు పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్లో నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నందికొట్కూరు విద్యాధికారి రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏజీఎం సురేష్, ఆర్ ఐ చౌదరి దీప స్కూల్ ప్రిన్సిపాల్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన వివిధ శాస్త్రీయ ప్రదర్శనలను ఆరు పరిశీలించారు. పర్యావరణ మార్పులు, సౌరశక్తి, రోబోటిక్స్, ఆరోగ్య పరిరక్షణ వంటి సమకాలీన అంశాలపై విద్యార్థులు రూపొందించిన నమూనాలు, ప్రాజెక్టులను సందర్శించి వాటి వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థుల ప్రతిభ, సృజనాత్మకతను ప్రశంసించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సమాజ అభివృద్ధికి విజ్ఞాన శాస్త్రమే మూలస్తంభమని, ప్రతి విద్యార్థి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. శాస్త్రీయ దృక్పథం ద్వారానే మూఢనమ్మకాలను పారద్రోలి, నవ సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సైన్స్ ఎగ్జిబిషన్లు విద్యార్థులలో పరిశోధనాత్మక దృక్పథాన్ని పెంపొందించడంతో పాటు సృజనాత్మక ఆలోచనలకు వేదికగా నిలుస్తాయని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలపై అవగాహన పెంచడంలో ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యపాత్ర పోషిస్తాయని చెప్పారు.

విద్యార్థులందరూ ఇలాంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయ బృందం పర్యవేక్షణలో జరిగిన అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని పిల్లల ప్రతిభను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీన్ ఉమా మహేశ్వర్ రావు, ఏవో గోపాల్ రెడ్డి, కోఆర్డినేటర్ రమణ, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

