కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..

కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ..
లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తున్న గ్రామ సర్పంచ్, నాయకులు,
భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్‌గల్ మండలంలోని చేంగల్ గ్రామంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ దూమల మమతరాజు అన్నారు. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ ముత్యాల సునీల్ కుమార్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ సర్పంచ్ దుమాల మమత రాజు చేతుల మీదగా కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. అర్హులైన లబ్ధిదారులు కల్యాణ లక్ష్మి చెక్కుతో కొద్ది భారాన్ని తగ్గినట్టు లబ్ధిదారులు అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయత్ కార్యదర్శి ప్రదీప్, ఏఎంసి డైరెక్టర్ నరసాపురం జీవన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆర్మూర్ రవి, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్తలు అడప రాజేశ్వర్, నూతుల రమేష్ నూతల వసంత్ రెడ్డి,గిర్ని నర్సారెడ్డి, శోభన్ గౌడ్, ఆనంద్ గౌడ్, తక్కూరి లింబాద్రి, బాబాగౌడ్, ప్రశాంత్ గౌడ్, తూర్పు శ్రీధర్, గోలి గంగారం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
