ఆజాద్ త్యాగం చిరస్మరణీయం..

ఆజాద్ త్యాగం చిరస్మరణీయం..

మాజీ మంత్రి దేవినేని ఉమా

ఆంధ్రప్రభ, విజయవాడ రూరల్ : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని టిడిపి కార్యాలయంలో విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్థంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు స్థానిక నాయకులతో కలిసి ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అహర్నిశలు పోరాడిన ఆజాద్ ధైర్యసాహసాలు యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు.

స్వాతంత్య్ర సమరంలో ఆయన చూపిన త్యాగం, అచంచల సంకల్పం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని తెలిపారు. దేశభక్తి, స్వాభిమానమే ఆజాద్ జీవితం ఇచ్చిన ప్రధాన సందేశమని అన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. యువత దేశ చరిత్రను తెలుసుకుని మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు.

Leave a Reply