ఎస్సీ, ఎస్టీ కేసుల్లో అలసత్వం వహిస్తే సహించం..

ఎస్సీ, ఎస్టీ కేసుల్లో అలసత్వం వహిస్తే సహించం..
- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
మెదక్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఎస్సీ ఎస్టీల పై తప్పుడు కేసులు నమోదు చేయడం తగదని, ఎస్సీ, ఎస్టీ కేసుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు సూచించారు. శనివారం మెదక్ జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీల పై దాడులు జరిగితే అరికట్టలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల పై అలసత్వం వద్దని సూచించారు. నర్సాపూర్ పెద్దచింతకుంట గిరిజనుల పై జరిగిన దాడి కేసు విచారణలో ఐవోలు మార్చాలని చైర్మన్ ఎస్పీని ఆదేశించారు. జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనానికి మార్చి 26 వరకు స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణం ప్రారంభించాలని ఆర్డీవోను ఆదేశించారు.

హవేలిఘనపూర్ తదితర గ్రామాల్లో నెలకొన్న భూమి సమస్యలను 45 రోజులలో పరిష్కరించాలని ఆదేశించారు. నర్సాపూర్ మండలం మమతాబాద్ లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసి వసతులు, నాణ్యమైన భోజనం పై ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు నివేదిక సమర్పించాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని ఆదేశించారు. బాధితులకు నష్ట పరిహారము అందించడంలో నిర్లక్ష్యాన్ని విడనాడాలన్నారు. ఎస్సీ ఎస్టీ బాధితులకు ప్రారంభం కింద డబుల్ బెడ్ రూమ్ లను కేటాయించాలని ఆదేశించారు. హత్య అత్యాచారం సాంఘిక విష్కరణ తదితర కేసుల్లో బాధితులకు పక్క ఇండ్లను అందించాలని కోరారు.
చరిత్రలోనే రాష్ట్రా ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో సైబరాబాద్ మల్కాజ్గిరి హైదరాబాద్ జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్ లను పంపిణీ చేశామని తెలిపారు. అనంతరం వివిధ శాఖలు అమలు చేస్తున్న పథకాల పై సమీక్ష నిర్వహించారు. మెదక్ పట్టణంలోని ఎస్సీ కార్పొరేషన్ నూతన దుకాణాల సముదాయాల నిర్మాణాలను తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్, జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు, షెడ్యూలు కులాల అభివృద్ధి అధికారి విజయలక్ష్మి, గిరిజన అభివృద్ధి అధికారి నీలిమ, ట్రైన్ అధికారి సింధు, డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్, దళిత సంఘాల నాయకులు డివిఎంసి సభ్యులు పాల్గొన్నారు.
