Anil2KalyanRam | ఈసారి ప్లాన్ మామూలుగా లేదుగా..

Anil2KalyanRam | ఈసారి ప్లాన్ మామూలుగా లేదుగా..
- సంక్రాంతి బరిలో భారీ రిలీజ్
- వెంకీతో ఐదోసారి అనిల్.. హిట్ కాంబో రిపీట్
- ‘Pataas’ నుంచి మొదలైన అనిల్ – కళ్యాణ్ రామ్ అనుబంధం
- దగ్గుబాటి – నందమూరి కాంబోలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్
Anil2KalyanRam | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హిట్ మిషన్.. అనిల్ రావిపూడి.. వరుసగా సక్సెస్ సాధిస్తున్న విషయం తెలిసిందే. నెక్ట్స్ సంక్రాంతి టార్గెట్ గా సినిమా చేయబోతున్న అనిల్ ఈసారి ఎవరెవరితో సినిమా చేయనున్నాడు అనేది సస్పెన్స్ గా ఉండేది. వెంకీతో సినిమా ఖాయం అయితే.. ఆ సినిమాలో మరో హీరో క్యారెక్టర్ ఉందని.. ఆ పాత్రను పోషించే హీరో ఇతనే అంటూ రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇప్పుడు అనిల్ రావిపూడి ఎవరూ ఊహించని కాంబో అనౌన్స్ చేయడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. ఈసారి మూవీ ఎలా ఉండబోతుంది..?

Anil2KalyanRam | ఈసారి వేరే లెవల్..
అనిల్ రావిపూడి.. వెంకీతో చేసే సినిమాలో మరో హీరో అంటూ మలయాళ స్టార్ ఫహిద్ ఫాజిల్ పేరు గట్టిగా వినిపించింది. వెంకీ, ఫహిద్ ఫాజిల్.. ఇద్దరూ బావ బావమరిదిగా నటిస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఆతర్వాత ఫహిద్ ఫాజిల్ కాదు.. కోలీవుడ్ స్టార్ కార్తి అంటూ న్యూస్ వైరల్ అయ్యింది. ఇక అక్కడ నుంచి వెంకీ, కార్తి కలసి కామెడీ చేయనున్నారని.. ఈ సినిమా వేరే రేంజ్ లో ఉండబోతుంది అంటూ వార్తలు రావడంతో.. ఈ కాంబో నిజమే అనుకున్నారు. అయితే.. ఇలా ప్రచారం జరిగిన ప్రతిసారీ అనిల్ రావిపూడి తనదైన స్టైల్ లో క్లారిటీ ఇచ్చేవారు.

Anil2KalyanRam | అనిల్ స్టైల్ సర్ ఫ్రైజ్..
ఇప్పుడు ఊహించని కాంబోని అనౌన్స్ చేసి సర్ ఫ్రైజ్ చేశారు. ఈసారి దగ్గుబాటి వెంకటేష్- నందమూరి కళ్యాణ్ రామ్ ల కాంబోలో సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఊహించని ఈ కాంబో నిజంగానే కొత్తగా ఉంది. ఇక తెర పై వీరిద్దరూ చేసే ఎంటర్ టైన్మెంట్ ఏ రేంజ్ లో ఉండబోతుందో అనేది ఆసక్తిగా మారింది. ఈ ఇద్దరు హీరోలతో అనిల్ రావిపూడికి మంచి అనుబంధం ఉంది. వెంకటేష్‌తో రావిపూడి నాలుగు బ్లాక్ బస్టర్లు సాధించాడు. 5వ సారి వెంకీతో కలిసి పని చేస్తుండడం విశేషం.

Anil2KalyanRam | దగ్గుబాటి – నందమూరి..
తనకు మొదటి అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ తో ఈసారి సినిమా చేస్తుండడం ఆసక్తిగా మారింది. కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో అనిల్ రావిపూడి కెరీర్ స్టార్ట్ అయ్యింది. అందుకనే కళ్యాణ్ రామ్ అంటే అనిల్ రావిపూడికి ఎంతో అభిమానం, గౌరవం. సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ కళ్యాణ్ రామ్‌తో అనిల్ సినిమా చేస్తున్నారు. దగ్గుబాటి – నందమూరి కాంబోలో వచ్చే ఈ సినిమాకి కూడా తనదైన కామెడీ, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాను పండించేలా స్టోరీ రెడీ చేశారట. ఇది కూడా మరో బిగ్గెస్ట్ బ్లాక్ బ్లస్టర్ అవుతుందని ఇప్పటి నుంచే టాక్ బలంగా వినిపిస్తోంది. మరి.. ఈసారి వెంకీ, కళ్యాణ్ రామ్, అనిల్ కలిసి ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తారో చూడాలి.
