Reservoir | ఆ దృశ్యం వెనుక దుఃఖం..

Reservoir | ఆ దృశ్యం వెనుక దుఃఖం..

  • నిర్లక్ష్యం..నిండు ప్రాణం..
  • పత్రికలు గొంతెత్తినా..పట్టించుకోకపాయే..
  • రక్షణ గోడ లేక ప్రాణాలు పోతున్నయ్…
  • చర్యలు చేపట్టాలని కోరినా ఫలితం లేదని ప్రజల ఆగ్రహం
  • ఇంకా ఎందరు బలికావాలని ప్రశ్నిస్తున్న వాహనదారులు

Reservoir | స్టేషన్ ఘన్‌పూర్, ఆంధ్రప్రభ :

మన స్టేషన్ ఘన్‌పూర్ పట్టణానికి అందాన్ని అందించే రిజర్వాయర్… నిండుకుండలా మెరిసే నీటి తళుకులు…సాయంత్రం వేళల్లో చూడము చ్చటైన దృశ్యం. కానీ ఆ అందాల వెనుక దాగి ఉన్న ప్రమాదాన్ని పలు వురు చాలా కాలంగా హెచ్చరిస్తూనే ఉన్నారు. రిజర్వాయర్ రోడ్డుకు ఇరువైపులా రక్షణ గోడలు లేకపోవడం, ఇనుప కంచెలు ఏర్పాటు చేయ కపోవడం వల్ల ఎప్పటికైనా ప్రమాదం సంభవిస్తుందనే ఆందోళనను స్థాని కులు, ప్రజాప్రతినిధులు, పత్రికలు పలుమార్లు వ్యక్తం చేశాయి. ఒక్క నిర్లక్ష్యం… ఒక ప్రాణం అని అప్పట్లోనే హెచ్చరికలు వినిపించాయి. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తులు కూడా వచ్చాయి. కానీ ఆ వినతిలు ఫైళ్ల మధ్యే ఆగిపోయాయి.

Reservoir | విషాదంగా మారిన అందమైన క్షణం:

ఈ రోజు(గురువారం)మధ్యాహ్నం అనుకోని ఘటన చోటుచేసుకుంది. ఒక కారు అదుపుతప్పి నేరుగా రిజర్వాయర్‌లోకి దూసుకెళ్లింది. రోడ్డు పక్కన రక్షణ గోడ లేకపోవడం వల్ల వాహనం నీటిలో పడిపోయింది. ఈ దుర్ఘట నలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. అందంగా కనిపించే ఆ జలాశయం ఒక్క క్షణంలోనే విషాద క్షేత్రంగా మారింది. మృతుని కుటుంబ సభ్యుల రోదనలు అక్కడి వాతావరణాన్ని కలచివేశాయి. స్థానికులను కంటతడి పెట్టించాయి.

Reservoir |

Reservoir | ముందే హెచ్చరికలు…కానీ చర్యలు ఎక్కడ?

రిజర్వాయర్ రోడ్డుపై రక్షణ గోడలు లేకపోవడం గురించి పలు సార్లు ఫిర్యాదులు వచ్చాయి. సోషల్ మీడియాలో చర్చలు జరిగాయి. వార్తల రూపంలో సమస్య వెలుగులోకి వచ్చింది. అయినా స్పష్టమైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రాణం పోయి న తర్వాత స్పందించడం ఎందుకు? ముందే జాగ్రత్తలు తీసుంటే ఈ విషాదం తప్పేదే కాదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా మేల్కొ ని శాశ్వత పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Reservoir | స్కూల్ బస్సులు, ఆటోలు పెద్ద సంఖ్యలో ప్రయాణం :

ఇదే రోడ్డుపై ప్రతిరోజూ స్కూల్ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వందల సంఖ్యలో ప్రయాణం చేస్తుంటాయి. ప్రతి ఉదయం చిన్నారులు పుస్తక సంచులు భుజాన వేసుకుని ఆశలతో స్కూల్‌కి వెళ్లే మార్గం ఇదే. తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తగా వెళ్లు బంగారం అని పంపించే దారి ఇదే. కానీ రక్షణ లేకుండా ఉన్న ఈ రోడ్డుపై ప్రతి ప్రయాణం ఒక ఆందోళనగా మారుతోంది.పిల్లలు సురక్షితంగా ఇంటికి చేరేవరకు తల్లి దండ్రుల గుండెల్లో కలిగే ఆందోళనను మాటల్లో చెప్పలేం..ఈ మార్గం అందంగా మాత్రమే కాకుండా సురక్షితంగా కూడా మారాలనే ఆశతో అందరూ ఎదురుచూస్తున్నారు.

Reservoir | వెంటనే తీసుకోవాల్సిన చర్యలు:

రిజర్వాయర్ రోడ్డుకు ఇరువైపులా బలమైన రక్షణ గోడలు నిర్మించాలి. ఇనుప కంచెలు, రిఫ్లెక్టర్ బోర్డులు ఏర్పాటు చేయాలి. రాత్రివేళల్లో సరి పడా వీధి దీపాలు అమర్చాలి. స్పష్టమైన ప్రమాద హెచ్చరిక బోర్డులు పెట్టాలి. వేగ నియంత్రణ సూచనలు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి.

Reservoir | ప్రజల డిమాండ్ :

ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి రిజర్వాయర్ రోడ్డును సుర క్షితంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు. మరొక కుటుంబం కన్నీరు పెట్టుకోకుండా కాపాడటం సమాజం మొత్తం బాధ్యత.. ఒక ప్రాణం కోల్పోయిన తర్వాత కాదు…ముందే జాగ్రత్తలు తీసుకోవడమే నిజమైన పరిపాలనని చెబుతున్నారు. ఈరోజు జరిగిన ఈ విషాదం మళ్లీ పున రావృతం కాకుండా చర్యలు తీసుకుంటేనే బాగుంటుందని అభిప్రాయం పడుతున్నారు.

Leave a Reply