విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు

  • ట్రాన్స్.కో ఎస్సీ శ్రీనివాస్

హుజూర్‌నగర్, ఆంధ్రప్రభ : హుజూర్‌నగర్ మున్సిపల్ పరిధిలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ట్రాన్స్.కో ఎస్సీ ఎ. శ్రీనివాస్ స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని 19 24 వార్డులలో మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ కౌన్సిలర్స్ వల్లపుదాసు కృష్ణ, యడ్ల విజయ్ లతో కలిసి పర్యటించి లో ఓల్టేజ్, విద్యుత్ సరఫరాలో వస్తున్న అంతరాయలపై స్థానికుల నుంచి వచ్చిన సమాచారం మేరకు విద్యుత్ సమస్యలన్నీ కొద్దికాలంలోనే పరిష్కారం అయ్యేలా చూస్తామన్నారు. 24వ వార్డులో ఏళ్ల నాటి విద్యుత్ సమస్యలకు మోక్షం లభించనుంది.

కొత్తగా బైపాస్ రోడ్డు ఏర్పాటు కావడంతో పాటు వార్డు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, గతంలో ఏర్పాటు చేసిన పాత ట్రాన్స్‌ఫార్మర్లు, ఎల్‌టి లైన్ల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించి వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి, నూతన ట్రాన్స్ఫార్మర్ లు ఏర్పాటు చేస్తామన్నారు. విద్యుత్ శాఖ అధికారులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో తక్షణమే సమస్య పరిష్కారానికి రూ. 2 లక్షల నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.

చాలా కాలంగా వేధిస్తున్న లో-వోల్టేజ్, విద్యుత్ అంతరాయాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుండటంతో 24వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ డీఈ వెంకట కృష్ణయ్య, ఎఈ రాంప్రసాద్, ఎఫ్ఆర్ చంద్రమౌళి, లైన్ మెన్ లు బ్రహ్మ రెడ్డి, నాగరాజు, గురవయ్య, జగదీష్ , వీరభద్రం, ఎఎల్ఎం బాబునాయక్, జెఎల్ఎమ్ గోపీచంద్ వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply