కోడూరు గంగానమ్మకు జలాభిషేకం..

కోడూరు గంగానమ్మకు జలాభిషేకం..
కోడూరు – ఆంధ్రప్రభ : కోడూరు గ్రామంలో కొలువు దీరి భక్తులచే విశేష పూజలు అందుకుంటున్న శ్రీగంగానమ్మ అమ్మవారి ఆలయ 13వ పునః ప్రతిష్టా మహోత్సవాలలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా అభిషేకానికి వినియోగించే సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, బిందెలతో జలమను భక్తులు చేతపట్టి ఆలయం చుట్టూ డప్పుల వాయుధ్యాలతో ప్రదక్షణలు చేశారు.
ఆలయ అర్చకులు కొమ్మూరు శ్రీనివాస శర్మ విశేష పూజలు చేసి అనంతరం అమ్మవారి మూల విరాట్ కు అభిషేకం చేశారు. ఆలయ చైర్మన్ కోట యుగంధర్ రావు ఏర్పాట్లను పర్యవేక్షించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
