ఆవులకు ప్రేమతో..

ఆవులకు ప్రేమతో..

వికారాబాద్, ఆంధ్రప్రభ : ఆమెకు ఆవులంటే ప్రాణం. వారి వద్ద 26 ఆవులున్నాయి వాటన్నిటిని కలిపి గోశాల ఏర్పాటు చేయాలని ఆలోచనతో ఆమె ముందుకు సాగుతుంది. ఇoదుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన మ్యాడం లక్ష్మీ సాయినాథ్ కు చిన్నప్పటి నుండి ఆవులు లేగదుడులు అంటే పంచప్రాణం. వాటిని ప్రేమిస్తూ వాటి ఆలనా పాలన చూడడం ఆమె అలవాటుగా చేసుకున్నారు.

ప్రస్తుతం వారి వద్ద 26 ఆవులున్నాయి. త్వరలో వికారాబాద్ ప్రాంతంలో గోశాల ఏర్పాటు చేసి వాటిని పెంచాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్టు లక్ష్మీ సాయినాథ్ తెలిపారు. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మీ సాయినాథ్ మాట్లాడుతూ.. సాధు జంతువులైన ఆవులను ప్రేమించడం మన బాధ్యతగా భావించాలని వాటి ద్వారా మంచి జరుగుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. రాబోయే రోజుల్లో వికారాబాద్ ప్రాంతంలో ఓ మంచి గోశాలను నిర్మిస్తామన్న దృఢ సంకల్పాన్ని ఆమె వ్యక్తం చేశారు.

Leave a Reply