ఏవైఎస్ ఆధ్వర్యంలో సన్మానం..

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రానికి చెందిన దొడ్డి కిష్టయ్య, రేగొండ మండలం కోటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి కమిటీ నూతన డైరెక్టర్ గానియమితులయ్యారు. కిష్టయ్యతో పాటు అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత గురుకుంట్ల కిరణ్ లకు నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ , ఏ వై ఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య లతో కలిసి అంబేద్కర్ యువజన సంఘం నాయకులు శాలువాలతో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు జన్నే యుగేందర్, ప్రధాన కార్యదర్శి పుల్ల ప్రతాప్ , మిట్టపల్లి మిత్ర మండలి అధ్యక్షుడు పుల్ల సతీష్ కుమార్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు గురుకుంట్ల కిరణ్, మాస్ రమేష్, గుర్రపు నరసయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
