బాసరలో త్రిబుల్ ఐటీ విద్యార్థిని సూసైడ్..!

బాసరలో త్రిబుల్ ఐటీ విద్యార్థిని సూసైడ్..!

ఆదిలాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: బాసర ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ విద్యార్థిని బుధవారం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కళాశాలలో విషాదం నింపింది. వనపర్తి జిల్లాకు చెందిన వసంత (21) గత మూడేళ్లుగా బాసర ట్రిపుల్ ఐటీ లో చదువుతోంది. ఉదయం 10: 20 గంటల ప్రాంతంలో హాస్టల్ గదిలోనే ఒంటరిగా ఉన్న సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ లో ఈసీఈ కోర్స్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వసంత రెండు మూడు రోజులుగా ముభావంగా ఉన్నట్టు తెలిసింది. ఆమె ఉరివేసుకుని మృతి చెందిన ఘటన సమాచారం మధ్యాహ్నం వరకు బాసర త్రిబుల్ ఐటీ యాజమాన్యం బయటకు పొక్కనివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంది. బాసర పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే వసంత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బైసా ఆసుపత్రికి తరలించి వైద్యులు శవ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం వసంత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వసంత ఆత్మహత్య ఘటన బాసర త్రిబుల్ ఐటీ కళాశాలలో విషాదం నింపింది. పోస్టుమార్టం వద్దకు స్నేహితులు భారీగా తరలివచ్చారు.

సూసైడ్ కు వ్యక్తి గత కారణాలే..!

ఉడివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ వసంత మెడ చుట్టూ గాయాలు ఉన్నాయని బాసర పోలీసులు ఓ ప్రెస్ నోట్ లో తెలిపారు. ఆమె మృతికి వ్యక్తిగత కారణాలే ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల, బైoసా ఏఎస్పి సంఘటన స్థలాన్ని సందర్శించి వసంత మృతికి గల కారణాలు ఆరా తీశారు. బైసా ప్రభుత్వ ఆసుపత్రి పోస్టుమార్టం వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటీవల బాసర త్రిబుల్ ఐటీ కళాశాలలో విద్యార్థులకు భద్రత లేదని, వారి సమస్యలు బయటకు రానివ్వకుండా యాజమాన్యం ఆంక్షలు విధించిందని, మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకపోయిందని విద్యార్థులు వాపోయారు. వసంత మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, నిందితులను శిక్షించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.

Leave a Reply