Tragedy | గ్రామంలో భ‌యాందోళ‌న‌లు…

Tragedy | గ్రామంలో భ‌యాందోళ‌న‌లు…

Tragedy | సత్తెనపల్లి/రాజుపాలెం, ఆంధ్ర‌ప్ర‌భ : పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలంలో విషాదం చోటుచేసుకుంది. మండల పరిధిలోని ఉప్పలపాడు గ్రామంలో ఒక మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. గ్రామానికి చెందిన వేల్పుల మల్లేశ్వరి (45) అనే మహిళ తన నివాసంలో తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉంది.

మల్లేశ్వరి ఒంటిపై ఉన్న గాయాలను గమనిస్తే, ఆమెను ఎవరో దుండగులు హత్య చేసి ఉండవచ్చని గ్రామస్థులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న రాజుపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మల్లేశ్వరి మృతికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. పాత కక్షలా లేదా కుటుంబ గొడవలా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటనతో ఉప్పలపాడు గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.

Leave a Reply